హైదరాబాద్, తెలంగాణ బిల్లుపై అసెంబ్లీ ప్రక్రియ పూర్తి అయినందున పార్లమెంట్లో తెలంగాణ బిల్లు ఆమోదం తధ్యమని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు. మద్ధతు విషయంలో ఒక వేళ భాజపా వెనక్కి తగ్గినా యూపీఏ ప్రభుత్వం సాధారణ మెజారిటీతో ఉభయ సభల్లో తెలంగాణ బిల్లును ఆమోదించుకుంటుందని శంషాబాద్ ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మరోవైపు కేవీపీతో సహా సీమాంధ్ర నేతలంతా పదవుల కోసం అక్కడి ప్రజల ఓట్ల కోసం సమైక్యాంధ జపం చేసుతన్నారన్నారు తప్ప…. సీమాంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం కృషి చేయడం లేదని మధుయాష్కి విమర్శించారు.




