హైదరాబాద్: రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు సుప్రీంకోర్టులో పోరాడతామని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి అన్నారు. ప్రభుత్వపరంగానా, వ్యక్తులుగానా త్వరలో నిర్ణయిస్తామని ఆయన చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు రెబల్‌గా పోటీ చేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి సమైక్యవాదం వినిపిస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌ను వ్యతిరేకిస్తున్నట్లేనని మంత్రి ఆనం పేర్కోన్నారు. ఏది ఏమైనప్పటికి రాజ్యసభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్ధులే గెలుస్తారని ఆయన వివరించారు.




