హైదరాబాద్: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలోని పార్టీ నేతల బృందం సోమవారం రాత్రి 7.30 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీతో భేటీ కానుంది. రాష్ట్రంలో జరిగిన అన్ని పరిణామాలను రాష్ట్రపతికి వివరిస్తామని ఆ పార్టీ ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. శాసనసభలో జరిగిన చర్చ, ఇతర పరిణామాలు రాష్ట్రపతికి వెల్లడిస్తామని చెప్పారు.




