న్యూఢిల్లీ: తెలంగాణ ప్రాంత మంత్రులు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన ప్రక్రియ తుది దశకు చేరిన నేపధ్యంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలుస్తామని మంత్రులు ఈ సందర్భంగా దిగ్విజయ్‌ను కోరారు. రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసేందుకు తనకు అభ్యంతరం లేదని మంత్రులకు దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.




