Tuesday, 3 November 2026

స్టాలిన్‌కు భద్రత కోరడంపై తప్పుబట్టిన జయ

హైదరాబాద్‌: డీఎంకే నేత స్టాలిన్‌కు భద్రత కల్పించాలని కోరుతూ ఆయన తండ్రి, డీఎంకే అధినేత రుణానిధి కేంద్రాన్ని కోరడాన్ని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తప్పుబట్టారు. స్టాలిన్‌కు ఎల్‌టీటీఈ నుంచి కానీ మతోన్మాదుల వల్ల కానీ ప్రమాదం ఉందని లేఖలో పేర్కోనడాన్ని ఆమె ఖండించారు. 2009లో శ్రీలంకలో జరిగిన పోరులో ఎల్‌టీటీఈ పూర్తిగా తుడిచి పెట్టుకు పోవడంతో తమిళపులులు ఎక్కడ ఉన్నారని ఆమె ప్రశ్నించారు. మతోన్మాదులు ఏ సంస్థకు చెందినవారని స్పష్టంచేయక పోవడాన్ని ఆమె తప్పుబట్టారు. కుటుంబకలహాలను రాష్ట్రం పైకి రుద్దాలనుకుంటున్న యత్నాలను విరమించుకోవాలని ఆమె హితవు పలికారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *