బంతిఅనుకుని ఆడుకుంటుండగా దుర్ఘటన
పాట్నా: ఎవరో ధ్యానపుగాదెలో దాచి వుంచిన బాంబును బంతిగా భ్రమించి, దానితో ఆడుకుంటుండగా అది పేలడంతో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడిన ఉదంతం బీహర్‌లోని వైశాలి జిల్లాలో జరిగింది. రాఘోపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నగర్‌గావా గ్రామంలో ఈ దుర్ఘటన జరగ్గా క్షతగాత్రులను గుట్టు చప్పుడు కాకుండా ఆస్పత్రులకు తరలించిన గ్రామస్తులు విషమం పోలీసులకు తెలియకుండా జాగ్రత్త పడ్డారు. అయితే అనోట ఈనోట వ్యాపించి, ఈసంగతొ తెలియడంతో పోలీసులు గ్రామానికి చేరుకుని, దర్యాప్తు ప్రారంభించారు. బంబును ధాన్యపు గాదెలో దాచినదెవరో కనుగోనేందుకు ప్రయత్నిస్తున్నారు.




