Tuesday, 3 November 2026

ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో రాహుల్‌ భేటీ

ఢిల్లీ : ఈశాన్య రాష్ట్రాల ఎంపీలతో ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, కేంద్ర ¬మంత్రి షిండే సమావేశమయ్యారు. సమావేశంలో ఈశాన్య రాష్ట్రానికి చెందిన విద్యార్థి నిడోతానియా మృతిపై ఎంపీలతో చర్చించినట్లు సమాచారం. విద్యార్థి మృతిపై దేశ రాజధానిలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రతరమౌతున్నాయి. నిన్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత సుస్మాస్వరాజ్‌ విద్యార్థి మృతిని ఖండించారు. ఈ నేపథ్యంలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు దేశ రాజధానిలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించడానికి కేంద్ర ¬ంమంత్రిత్వశాఖ 5గురు సభ్యులతో కమిటిని నియమించింది. ఢిల్లీ హైకోర్టు ఈ ఘటనను సుమోటుగాస్వీకరించి విచారణ జరుపుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *