Tuesday, 3 November 2026

పవార్‌జీ.. తెలంగాణకు మద్దత్విండి


టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 (జనంసాక్షి) :
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు మద్దతివ్వాలంటూ టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్‌ను కోరారు. బుధవారం ఢిల్లీలోని ఆయన నివాసానికి వెళ్లిన కేసీఆర్‌ త్వరలో పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా నిలవాలంటూ విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం నాలుగున్నర దశాబ్దాలుగా సాగుతోన్న ఉద్యమం, ఆత్మబలిదానాలు, సర్కారీ హత్యలను ఆయన వివరించారు. శరద్‌ పవార్‌ స్పందిస్తూ తమ పార్టీ గతంలోనే తెలంగాణకు సానుకూల నిర్ణయం తీసుకుందని, వరంగల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్‌ బహిరంగ సభలో తానూ పాల్గొని మద్దతునిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టినప్పుడు తమ పార్టీ ఎంపీలు సానుకూలంగా ఓటు వేస్తారని ఈ సందర్భంగా పవార్‌ హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *