హైదరాబాద్: రాజ్యసభ పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. ఈ ఎన్నికల్లో ఓటర్లు తిరస్కరణ ఓటు కూడా వినియోగించుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అనంతరం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని అసెంబ్లీ అధికారులు తెలిపారు.




