న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లుపై భాజపాతో కేంద్రం సంప్రదింపులు జరుపుతోందని భాజపా నేత హరిబాబు తెలిపారు. పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. కేంద్రం తన ప్రతిపాదనలు తెలిపితే పార్టీలో చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌ని యూటీని చేయాలన్న డిమాండ్ భాజపా చేయలేదని ఆయన తెలిపారు.




