ఢిల్లీ : తెలంగాణ బిల్లును అడ్డుకోవడానికి మా వ్యూహాలు మాకు ఉన్నాయని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాద్ యూటీ అంటూ దొంగసాకు చూపి కేంద్రం బిల్లును పాస్ చేయాలని చూస్తున్నారు. బిల్లును అడ్డుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. కేంద్రం బిల్లు పాస్ చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని పేర్కొన్నారు.




