Wednesday, 4 November 2026

నాపైవేటు వేసే అవకాశం ఎవరికి ఇవ్వను : సీఎం

హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో సీమాంధ్ర మంత్రులు, ఎమ్మెల్యేలు జూబ్లీహాల్‌లో భేటీ అయ్యారు. భేటీ సందర్భంగా తనపై వేటు వేసే అవకాశం ఎవరికి ఇవ్వనని సీఎం సీమాంధ్ర నేతలతో చెప్పినట్టు సమాచారం. రాస్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు ఏ త్యాగానికైనా సిద్ధం. దీనిపై సీమాంధ్ర నేతలు స్పందిస్తూసుప్రీంకోర్టులో తేల్చుకున్నాకే సమిష్టి నిర్ణయం తీసుకుందామని సీఎంతో పేర్కొన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఆవరణలో ముఖ్యమంత్రి రాజీనామా చేస్తున్నారంటూ సీమాంధ్ర నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాత్రి 7 గంటలకు ప్రెస్‌మీట్‌లో రాజీనామా నిర్ణయాన్ని ప్రకటిస్తారని పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *