ఢిల్లీ : చిన్న రాష్ట్రాలకు తమ మద్ధతు ఉంటుందని బీఎస్‌పీ అధినేతమాయావతి మరోమారు స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుకు గతంలోనే మద్ధతు ప్రకటించాం. తెలంగాణ బిల్లు వల్ల పార్లమెంట్ సమావేశాలు జరగడం లేదు. పరిస్థితి అంచనావేసి కీలకమైన బిల్లులను ముందే ఎందుకు పాస్ చేయలేదని ఆమె కేంద్రాన్ని ప్రశ్నించారు. సభ్యులను సస్పెండ్ చేసైనా ప్రభుత్వం బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదించాలని సూచించారు.




