హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాజ్యసభ ఎన్నికల్లో తిరస్కరణ ఓటు వేశారు. ఈ సందర్భంగా దగ్గుబాటి మీడియాతో మాట్లాడుతూ – ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చెప్పిన తర్వాతే తిరస్కరణ ఓటు వేశానని తెలిపారు. గతంలో హైకమాండ్‌ను ధిక్కరించాలని సంతకాలు సేకరణ చేసిన వాళ్ళే ఇప్పుడు హైకమాండ్ సూచించిన అభ్యర్ధులకు ఓటు వేయాలంటే ఎలా అని ప్రశ్నించారు.




