ఢిల్లీ : చంద్రబాబు ఏం చేసినా తెలంగాణ ఆగదని పాల్వాయి గోవర్ధన్ అన్నారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పాస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. టీటీడీపీ నేతలు ఇప్పటికైనా కళ్లు తెరచి కొత్త పార్టీ పెట్టుకోవాలని హితవు పలికారు. సీమాంధ్ర కేంధ్ర మంత్రులు ప్రతిపాదించిన సవరణలు ఆమోదయోగ్యమైనవి కావని పేర్కొన్నారు. భద్రాచలం తెలంగాణలోనే ఉంటుందని తెలిపారు.




