న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ వ్యతిరేకం అంటూ సీమాంధ్ర నాయకులు వేసిన పిటిషన్లు సుప్రీంకోర్టు కొట్టేయడంపై తెలంగాణ వాదులు హర్షం వ్యక్తం చేశారు. సీమాంధ్ర నేతల వాదనల్లో వాస్తవం లేదని సుప్రీం కోర్టు తీర్పులో తేలిందని టీవాదులు అంటున్నారు.
సీమాంధ్ర నాయకులు వారి హక్కుల కోసం పోరాడాలి తప్ప తెలంగాణను అడ్డుకుంటామని కోర్టు సమయం వృథా చేయడం, మా సమయం వృథా చేయడం సరికాదని టీఆర్‌ఎస్ నేత వినోద్ అన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర ప్రజలను మభ్యపెట్టడం మాని ప్రజల హక్కుల గురించి పోరాడాలని ఆయన హితవు పలికారు.




