Wednesday, 4 November 2026

ప్రేమికుల రోజు నిషేధానికి బజరంగ్‌దళ్‌ పిలుపు

హైదరాబాద్‌: ప్రేమికుల రోజు నిషేధానికి బజరంగ్‌దళ్‌పిలుపునిచ్చింది. పబ్బులు, హోటళ్లు వాలెంటైన్స్‌ డే వేడుకలు జరుపవద్దని హెచ్చరించింది. ఫిబ్రవరి 14న పబ్బులు, క్లబ్బులను మూసివేయాలని సీపీని కోరనున్నట్లు తెలిపింది. వాలెంటైన్స్‌ డే భారతీయ సంస్కృతి కాదు. వాలెంటైన్స్‌ డే నాడు పెళ్లిళ్లు చేయడం మావిధానం కాదు. విశృఖల సంస్కృతి చాటి చెప్పడమే మాలక్ష్యం. వాలెంటైన్స్‌ డే నాడు ప్రేమికులకు పెళ్లిళ్లు చేయబోం. వారి తల్లి దండ్రులను పిలిపించి కౌన్సిలింగ్‌ ఇస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *