హైదరాబాద్: నగరంలోని నెక్లెస్ రోడ్డులో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో దక్షిణాసియాలో 2017 నాటికి అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో టోటల్ విటరసీ మిషన్ పేరిట రోటధాన్ 5కే రన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఫిట్‌నెస్ నిపుణురాలు దినాజ్ జెండా ఊపి ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించే పేద విద్యార్థులకు సహాయమందిస్తే వారు కూడా ఉన్నత విద్య నభ్యసిస్తారని రోటరీక్లబ్ ప్రతినిధి అనిల్ పేర్కొన్నారు.




