Wednesday, 4 November 2026

మంచువర్షంలో జపనీయుల పాట్లు

జపాన్‌ : జపాన్‌లో మంచు కురవడం వల్ల ఏడుగురు మృతిచెందారు. దాదాపు వెయ్యి మంది గాయపడ్డారు. గత కొన్ని దశాబ్దాలలో జపాన్‌తో ఇంత పెద్ద ఎత్తున మంచు ఎప్పుడూ కురవలేదని అక్కడి వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. టోక్యోలో శనివారం రాత్రికి పదిన్నర అంగుళాల మేర మంచు కురిసింది. గత 45 సంవత్సరాలలో ఇది రికార్డు. అక్కడ గవర్నర్‌ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పోలింగ్‌కు వాతావరణం తీవ్ర అవరోధంగా మారే అవకాశం ఉందని అధికారులు భయపడుతునానరు. మంచు కురవడం వల్ల సంభవించిన రోడ్డు ప్రమాదాల్లో, పైకప్పులపై పేరుకున్న మంచును తొలగించే క్రమంలో పడిపోయి… ఏడుగురు మరణించగా వెయ్యి మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *