ఒడిశా : కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు ఒడిశాలో 50 కి.మీ. రోడ్ షో ప్రారంభించారు. భువనేశ్వర్ నుంచి కటక్ జిల్లాలోని సాలిపూర్ వరకు ఈ రోడ్‌షో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆయన భువనేశ్వర్‌లో మాట్లాడుతూ ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌పై విరుచుకుపడ్డారు. పలు పథకాల కింద కేంద్రం ఇచ్చే నిధులన్నీ వాటికి వినియోగించకుండా దారి మళ్లిస్తున్నారన్నారు. పైగా కేంద్రం నిధులివ్వడం లేదని ఫిర్యాదుచేస్తున్నారని, గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం ఒడిశాకు కేటాయించినన్ని నిధులు మరెవరూ ఇవ్వలేదని రాహుల్ పేర్కొన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి ఇచ్చిన డబ్బును బిజూ జనతాదళ్ ప్రభుత్వం దొంగిలించిందన్నారు. వైద్యులు, ఉపాధ్యాయులు లేక ఆస్పత్రులు, పాఠశాలల మూతపడుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలనుంచి తీసుకున్న డబ్బును ప్రజలకోసం ఖర్చు పెట్టడం లేదని రాహుల్‌గాంధీ ఆరోపించారు.




