హైదరాబాద్ : తెలంగాణ ప్రజలు కోరుకున్నది స్వయంపాలనేకాని గవర్నర్ పాలన కాదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. సీమాంధ్ర పెట్టుబడిదారుల లాబీయింగ్‌కు కేంద్రం లొంగిపోయిందనే అభిప్రాయం కలుగుతోందన్నారు. పదో తరగతి ధ్రువపత్రాల ఆధారంగా ఉద్యోగులు, పింఛనుదారుల స్థానికత గుర్తించాలని, ఉద్యోగుల, పింఛన్ల పంపిణీ జరగాలని ఆమె అన్నారు. పోలవరం విషయంలో రాముడి గుడిని కేంద్రప్రభుత్వం రాజకీయం చేస్తోందని ఆరోపించారు.




