ఆధునిక యుగంలో సరి చేయడానికి గంట వ్యవధిచాలు :ఈటెల
హైదరాబాద్: తెలంగాణ బిల్లులో లోపాలున్నాయని, ఇలాంటి బిల్లుకు మద్దతు ఇవ్వలేమని బహిరంగంగా వ్యాఖ్యానించడం సరికాదని తెరాస నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. బిల్లులో లోపాలుంటే ఆధునికయుగంలో సరిచేయటానికి ఒ గంట చాలన్నారు. పార్టీ మ్యానిఫెస్టోలో , బహిరంగ వేదికలపైనా, పార్లమెంట్‌లో సుష్మా స్వరాజ్ లాంటా నేతలు తెలంగాణకు మద్దతుగా ప్రకటించారని చెప్పారు. ఈ దశలో తెలంగాణ విషయంలో భాజపా వెనక్కితగ్గుతుందని తాము భావించడం లేదన్నారు. తెరాస ఎమ్మెల్యేలంతా రేపు ఢిల్లీకి వెళ్లనున్నారని చెప్పారు.




