నెల్లూరు: బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి మిగులు జలాలు అందక ఏడారిగా మారబోతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తెలిపారు. నారాయణ మీడియాతో మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా కృష్ణా జలాల సమస్యపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి విన్నవించిన పట్టించుకోలేదని మండిపడ్డారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్ కారణమైన కేంద్రం మాత్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని ఆరోపించారు.




