న్యూఢిల్లీ: ఢిల్లీ శాసనసభలో సీఎం అరవింద కేజ్రివాల్‌కు తీవ్ర పరాభవం ఎదురైంది. ఇవాళ సభలో లెఫ్టినెంట్ గవర్నర్ సూచనలను ధిక్కరించి తీవ్ర గందరగోళం మధ్య ఆయన ప్రవేశపెట్టిన జన్‌లోక్‌పాల్ బిల్లును మెజారీటీ సభ్యులు వ్యతిరేకించారు. బిల్లు పత్రాలను చించివేసి మైకులను విరిచివేశారు. గవర్నర్ పంపిన లేఖపై ఓటింగ్ నిర్వహించాలని విపక్ష కాంగ్రెస్, బీజేపీ సభ్యులు పట్టుబట్టారు. స్పీకర్ వెల్‌లోకి దూసుకెళ్లి వారు ఆందోళనకు దిగారు. దీంతో ఆయన త్రీవ మనస్తాపానికి గురయ్యారు. బిల్లు పై చర్చించాలని కేజ్రివాల్ సభ్యులకు సూచించారు. మీరు చెప్పిందంతా నేను విన్నాను. నేను చేప్పేది కూడా మీరు వినండి అని విజ్ఞప్తి చేశారు. పాలనలో మాకు అనుభవం లేక పోయినా నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము అని తెలిపారు.




