Wednesday, 4 November 2026

పార్లమెంట్‌కు దుర్దినం : జాతీయ మీడియా

న్యూఢిల్లీ : ఓ పార్లమెంట్‌ సభ్యుడు పార్లమెంట్‌లో పెప్పర్‌ స్ప్రే చేయటం అబులెన్స్‌ పిలవడం, ఎంపీలు ఆసుపత్రి పాలు కావడం నిజంగా ఇది పార్లమెంట్‌కు దుర్దినమని సీఎన్‌ఎన్‌, ఐబీఎన్‌ చీఫ్‌ ఎడిటర్‌ రాజ్‌దీప్‌ సర్దేశాయి అన్నారు. 20 ఏళ్లుగా పార్లమెంట్‌ న్యూస్‌ కవర్‌ చేస్తున్నాను. బిల్స్‌ చింపేయడం, మైక్‌ విరగ్గొట్టడం లాంటి సంఘటనలు ఎన్నో చూశాను.

కాని ఈ రోజు పార్లమెంట్‌ సభ్యులు చేసిన దాడిని మాటల్లో చెప్పలేం. ఉన్మాదుల్లా ప్రవర్తించారు. నీ అభిప్రాయం చెప్పు అంతేకాని పెప్పర్‌ స్ప్రే చల్లటం మంచి పద్ధతి కాదు. ఇది పార్లమెంట్‌ డెమోక్రసీ సిగ్గు పడాల్సిన విషయం. కాంగ్రెస్‌ కాని, స్పీకర్‌ కానీ సరైన సమయంలో స్పందించలేదు.

బీజేపీ తెలంగాణపై డబుల్‌ గేమ్‌ ఆడుతోంది. ఎంపీలు సభలోని పెప్పర్‌ స్ప్రే, కత్తులు మాత్రమే తెచ్చారు. ఏకే 47 తేకపోవడం సంతోషించదగిన విషయమన్నారు. నిజంగా ఎంపీలు పూర్తిగా దిగజారారు. పార్లమెంట్‌ గౌరవాన్ని దిగజార్చారు. లగడపాటి రాజగోపాల్‌ పార్లమెంట్‌లో రిచెస్ట్‌ ఎంపీ. కాని ఈ రోజు ఆయన ప్రజాస్వామ్య విలువల విషయంలో పూర్‌ అని తెలిపారు. అలాగే మరో ఛానల్‌… టైమ్స్‌ నౌ ప్రతినిధి ఆర్నబ్‌ గోస్వామి సైతం లగడపాటి రాజగోపాల్‌, సీఎం రమేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *