న్యూఢిల్లీ: ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో బీజేపీ నేతలు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ భేటీ ముగిసింది. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించేందుకు ఇవాళ బీజేపీ నేతలు ప్రధానితో సమావేశమయ్యారు. బీజేపీ నేతలు బిల్లులో చేయాల్సిన ప్రతిపాదనలపై ప్రధాని తేల్చుకోలేకపోయారు. సీమాంధ్రకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ, పన్నుల తిరిగి లోక్‌సభకు పంపాల్సి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపధ్యంలో ప్రధిని మన్మోహన్‌సింగ్ మధ్యేమార్గంగా సభలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ సమావేశంలో ప్రధానితో పాటు కేంద్ర మంత్రులు జైరాం రమేష్, అహ్మద్ పటేల్, కమల్‌నాధ్‌లు కూడా పాల్గొన్నారు.




