న్యూఢిల్లీ: రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. రేపు ఉదయం 11 గంటలకు సభ తిరిగి ప్రారంభమవుతుందని డిప్యూటీ ఛైర్మెన్ ప్రకటించారు. ఇవాళ సామంత్రం 5 గంటలకు వాయిదా పడిన సభ తిరిగి ప్రారంభం కాగానే ఏ ప్రాతిపదికన రాష్ట్రాన్ని విభజిస్తున్నారని సీమాంధ్ర మంత్రి కావూరి సాంభశివరావు డిప్యూటీ ఛైర్మెన్‌ను ప్రశ్నించారు. దీంతో సభలో గందరగోళం నెలకొని రేపటికి వాయిదా పడింది.




