Tuesday, 3 November 2026

రాజ్యసభ అరగంట వాయిదా

ఢిల్లీ : రాజ్యసభ సమావేశం అరగంటపాటు వాయిదా పడింది. సభలో సీమాంధ్ర ఎంపీలు వెల్‌లోకి సమైక్య ప్లకార్డులు పట్టుకొని చేస్తున్న నిరసనలతో సభలో గందరగోళం నెలకొంది. ఆందోళన నడుమనే కొన్ని బిల్లులను ఛైర్మన్‌ ఆమోదించారు. సభ వ్యవహారాల్లో నాలుగు అంశాలను చర్చకు తీసుకొని ఐదవ అంశంగా ఉనన తెలంగాణను చర్చకు తీసుకుంటున్న తరుణంలో తమిళనాడు సభ్యులు ఇండియన్‌ ఫిషర్‌మేన& అంశంపై చర్చను చేపట్టాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఇదే అంవాన్ని చర్చకు తీసుకుంటున్నట్లు ప్రకటించినా సభ ఆర్డర్‌లోకి రాకపోవడంతో ఛైర్మన్‌ సభను అరగంటపాటు వాయిదా వేశారు. తెలంగాణకు మద్ధతుగా తెలంగాణ టీడీపీ ఎంపీ గుండు సుధారణ సీమాంధ్ర ఎంపీలకు పోటీగా వెల్‌లోకి వెళ్లి ప్లకార్డును ప్రదర్శించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *