ఢిల్లీ : గంట వాయిదా అనంతరం పార్లమెంట్ ఉభయ సభలు తిరిగి ప్రారంభమయ్యాయి. తిరిగి సమావేశమైన రాజ్యసభలో స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించారు. సీమాంధ్ర ఎంపీలు యథావిధిగా వెల్‌లోకి వెళ్ళి తమ నిరసనలతో ఆందోళన చేస్తున్నారు. తన స్థానంలోనే నిలబడి చిరంజీవి నిరసన తెలుపుతుండగా కేవీపీ, సుజనాచౌదరి, సీఎం రమేష్ వెల్‌లోకి ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలుపుతున్నారు.




