న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు భాజాపా కట్టుబడివుందని రాజ్యసభ భాజపా సభ్యుడు వెంకయ్యనాయుడు అన్నారు. అయితే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని మాత్రమే తాము డియాండ్ చేస్తున్నట్టు ఆయన అన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ. విద్యావకాశాలు, సీమాంధ్ర రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బిల్లు అటార్నీ జనరల్ అభిప్రాయం తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతం లేదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు.




