న్యూఢిల్లీ: దేశంలో పెద్ద రాష్ట్రాలతో ఒరిగేదేమీ లేదని బీఎస్పీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ బిల్లుపై చర్చ సందర్భంగా ఆమె సభలో ప్రసంగించారు. అందుకే పెద్ద రాష్ట్రాల వల్ల అభివృద్ధి సాధ్యంకాదని ఆనాడే రాజ్యంగ నిర్మాత చెప్పిన విషయాలను ఆమె ఊటంకించారు. అందుకే ఉత్తరప్రదేశ్‌ను కూడా నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని యూపీ అసెంబ్లీ తీర్మానం చేసిందని ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ చాలా వెనుకబడి ఉంది
తెలంగాణ ప్రాంతం చాలా వెనుకబడి ఉందని మాయావతి స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వకుంటే రాష్ట్రం ఇచ్చినా లాభం లేదని పేర్కొన్నారు. అసలు తెలంగాణను ఏర్పాటు చేయాల్సింది ఇప్పటికే ఆలస్యమైంది అని తెలిపారు.




