న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంతాల సమస్యలను తాము అర్ధం చేసుకున్నామని ప్రధాని మన్మోహన్‌సింగ్ స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రజల సమస్యలపై అర్ధం చేసుకున్నామన్నారు. సీమాంధ్రకు ప్రత్యేక హోదానిస్తున్నామపి ప్రకటించారు. సీమాంధ్ర రాయలసీమ జిల్లాలకు ఈ హోదా వర్తిస్తుందని స్పష్టం చూశారు. ఈ హోదా ఐదేళ్లపాటు కొనసాగుతుందన్నారు. సీమాంధ్రకు ఆరు సుత్రాల అభివృద్ధి ప్యాకేజీ ఇస్తున్నామన్నారు. సీమాంధ్ర ఆర్థికంగా ఎదగడానికి ఇది పనికి వస్తుందని స్పష్టం చేశారు. పారిశ్రామికంగా ప్రోత్సాహానికి పన్ను రాయితీ దోహదపడుతుందన్నారు. అయితే ఐదేళ్ల ప్రత్యేక హోదా సరిపోతుందన్నారు. అయితే ఐదేళ్ల ప్రత్యేక హౌదా సరిపోదని బీజేపీ నేత వెంకయ్యనాయుడు వ్యతిరేకిస్తూ సవరణ సూచించారు. అయితే ఈ సవరణను సభ్యులు తిరస్కరించారు. దీంతో సవరణ వీగిపోయినట్టు డిప్యూటీ ఛైర్మెన్ కురియన్ ప్రకటించారు.




