Tuesday, 3 November 2026

తెలంగాణకు బిజెపి కట్టుబడి ఉంది

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బిజెపి కట్టుబడివుందని రాజ్యసభలో వెంకయ్యనాయుడు అన్నారు. అయితే సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలని మాత్రమే తాము డిమాండ్‌ చేస్తున్నట్టు ఆయన అన్నారు. ఈ దశలో కలసి ఉండడం కన్నా విడిపోయి సంతోషంగా ఉండడం మేలని తాను భావిస్తున్నాని అన్నారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ, విద్యావకాశాలు, సీమాంధ్ర రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అలాగే సీమాంధ్ర అభివృద్దికి చర్యలు తీసుకుని, అక్కడి పోర్టులను, ఎయిర్‌పోర్టులను ప్రభుత్వమే అభివృద్ది చేయాలన్నారు. బిల్లుపై అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవడంలో ఎలాంటి అభ్యంతరం లేదని ఆయన తన ప్రసంగంలో పేర్కొన్నారు. వి వాంట్‌ తెలంగాణ..అండ్‌ జస్టిస్‌ ఫర్‌ సీమాంధ్ర తెలంగాణ కోరుకుంటున్నా సీమాంధ్రులకు న్యాయం జరగాలన్నదే తమ అభిమతమన్నారు. రాజ్యసభ లో పలు మార్లు వాయిదా పడిన అనంతరం టి బిల్లుపై చర్చను ఆయన ప్రారంభించారు. అయితే రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై రాజ్యసభలో వెంకయ్యనాయుడు తీవ్ర గందరగోళం మధ్య ప్రసంగించారు. రాజ్యసభలో సాధారణ స్థితి నెలకొల్పేందుకు డిప్యూటీ ఛైర్మన్‌ యత్నించాలని నాయుడు కోరినా లాభం లేకపోవడంతో గందరగోళం మధ్యే తాను చెప్పదల్చుకున్న విసయాలను చెప్పారు. అయితే తాను ఏం చేయగలనని కురియన్‌ అన్నారు. సభ్యుల ప్రవర్తన బాగా లేదని ఆయన అసహనం వ్యక్తంచేశారు. సభ్యుల నినాదాల మధ్య వెంకయ్య ప్రసంగం ప్రారంభించారు. అయితే సభ్యుల ఆందోళన కొనసాగితే చర్చ ఎలా జరుగుతుందని వెంకయ్య ప్రశ్నించారు. ఆంధప్రదేశ్‌ విభజన విషయంలో ప్రధాన ముద్దాయి కాంగ్రెసేనని వెంకయ్య నాయుడు విమర్శించారు. ఇచ్చిన మాటకు కట్టు-బడే లక్షణం కాంగ్రెస్‌కు లేదని దుయ్యబట్టారు. 2004 నుంచి రాజకీయ లబ్దితో వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో అన్ని పార్టీలు మాట మార్చాయని, బీజేపీ ఒక్కటే నిక్కచ్చిగా ఉందని అన్నారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ పార్టీ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. రెండు ప్రాంతాలను విభజించండి, ప్రజలను కాదు అని స్పష్టం చేశారు. భద్రత, ఉపాధి, విద్య సహా పలు అంశాలపై సీమాంధ్రులకు ఆందోళన ఉందని చెప్పారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణకు మాత్రమే రెవెన్యు మిగులుందని వెల్లడించారు. హైదరాబాద్‌ ఆదాయం ఇరు ప్రాంతాలకు కీలకంగా మారిందన్నారు. హైదరాబాద్‌లో మిగులుతున్న ఆదాయాన్ని మిగతా ప్రాంతాలకు పంపిణీ చేయాలని సూచించారు. విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల స్థాయిని పెంచాలన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి ప్రత్యేక రైల్వే జోన్లు కేటాయించాలన్నారు. బిల్లుపై సవరణల గురించి అటార్నీ జనరల్‌ అభిప్రాయం తీసుకోవడంలో తప్పులేదన్నారు.ఇవన్నీ కోరుతూనే తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామన్నారు. సీమాంధ్ర సమస్యలను పరిష్కరించాలన్నదే మా డిమాండ్‌ అని చెప్పారు. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలకు రక్షణ, విద్యావకాశాలు, సీమాంధ్ర రెవెన్యూ అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలన్నారు. రాయలసీమ పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. రాష్ట్ర విభజనలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలి. దీంతో పాటు ఉత్తరాంధ్రకు కూడా న్యాయం చేయాలి. ఈ రెండు ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. సీమాంధ్రకు ఎలాంటి వనరులు కల్పించకుండా విభజన బిల్లును తీసుకువచ్చారని, రాష్ట్ర విభజనతో నష్టపోతున్న సీమాంధ్రకు ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించాలి. దీనిపై ప్రధాని సభలో ప్రకటన చేయాలి. హిమాచల్‌ప్రదేశ్‌ తరహాలో ఈ ప్రాంతానికి పన్ను రాయితీలు కల్పించాలన్నారు. ప్రాంతాలను విభజించండి… ప్రజలను కాదంటూ రాష్ట్ర విభజన సమస్యను జటిలం చేసి కాంగ్రెస్సే విలన్‌లాగా వ్యవహరించిందన్నారు. 2004, 2009 ఎన్నికల్లో తెలంగాణ ఇస్తామని హావిూ ఇచ్చి ఏర్పాటుకు పదేళ్లు తీసుకుందన్నారు. రాష్ట్ర విభజనకు సంబంధించి కాంగ్రెస్‌ డబుల్‌గేమ్‌ ఆడుతోంది. సీమాంధ్రలో ఒకలాగా తెలంగాణలో మరోలాగా వ్యవహరిస్తోందని, సీమాంధ్ర, తెలంగాణలోని తెలుగు ప్రజలు సోదరుల్లాగా వుండాలన్నారు. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌పై ఎవరైనా కోర్టుకు వెళితే ఏమవుతుంది? హైదరాబాద్‌లో ఉండేవారు వెళ్లిపోవాలని కొందరు చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. కాంగ్రెస్‌కు ఒక విధానం అంటూ లేదని వెంకయ్యనాయుడు నిశితంగా విమర్శించారు. ఇరు ప్రాంతాలు సంతృప్తికరంగా విభజించకుండా రాజకీయంగా పబ్బంగడిపేందుకు యత్నిస్తోందని ఆయన అన్నారు. రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై రాజ్యసభలో ప్రసంగించిన భాజపా సభ్యుడు కాసేపు తెలుగులో ప్రసంగించారు. సీమాంధ్ర, తెలంగాణలోని తెలుగు ప్రజలు సోదరుల్లాగా వుండాలని ఆకాంక్షించారు. రాష్ట్ర విభజనతో నష్టపోతున్న సీమాంధ్రకు ఏటా రూ. 10 వేల కోట్లు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రధాని సభలో ప్రకటన చేయాలని ఆయన కోరారు. హిమాచల్‌ప్రదేశ్‌ తరహాలో ఈ ప్రాంతానికి పన్ను రాయితీలు కల్పించాలని ఆయన కోరారు. ప్రాంతాలను విభజించండి ప్రజలను కాదని ఆయన అన్నారు. సీమాంధ్రకు ఎలాంటి వనరులు కల్పించకుండా విభజన బిల్లును తీసుకువచ్చారని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.ఆంధప్రదేశ్‌లో రాయలసీమ పూర్తిగా వెనుకబడిన ప్రాంతమని భాజపా నేత రాజ్యసభలో పేర్కొన్నారు. రాష్ట్ర విభజనలో ఈ ప్రాంతానికి న్యాయం చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దీంతో పాటు ఉత్తరాంధ్రకు కూడా న్యాయం చేయాలన్నారు. ఈ రెండింటి ప్రాంతాలకు ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *