Tuesday, 3 November 2026

మంత్రిగా ఉంటూ విభజనను వ్యతిరేకిస్తున్నా

న్యూఢిల్లీ,ఫిబ్రవరి20: రాజ్యసభలో తెలంగాణ బిల్లుపై జరిగిన చర్చలో కేంద్ర మంత్రి చిరంజీవి పాల్గొన్నారు. చిరంజీవి మాట్లాడడానికి లేవగానే సభలో నిశ్శబ్ద వాతావరణం నెలకొనడం విశేషం. తాను కాంగ్రెస్‌ సభ్యుడైనప్పటికీ విభజనను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపారు. రాజ్యసభలో ఇది తన తొలి ప్రసంగమని ఆయన అన్నారు. విభజన 11 కోట్లమంది తెలుగువారికి గుండెకోతన్నారు. సీడబ్ల్యుసీ తీర్మానం నుంచి జరిగిన పరిణామాలను ఆయన సభకు తెలిపారు. చిరంజీవి ప్రసంగిస్తూ తాను తెలుగు ప్రజల తరఫున మాట్లాడుతున్నాను. కోట్లాది మంది తెలుగు ప్రజలు తమను అన్యాయంగా విభజిస్తున్నారని బాధపడుతున్నారు. నేను ఏ ఒక్క ప్రాంతం తరఫునో మాట్లాడటం లేదు. రాష్టాన్న్రి విభజించాలనుకోవడం చాలా దురదృష్టకరమన్నారు. అధికార పార్టీలో ఉంటూ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడాల్సి వస్తోందన్నారు. జనం వీధుల్లోకి వచ్చి తమ ఆగ్రహావేశాలను, ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణ కమిటీలో కూడా రాష్టాన్న్రి యథాతథంగా ఉంచాలని తెలిపింది. విభజన అనేది 11 కోట్ల మంది ప్రజలకు గుండెకోత కలిగించే విషయం. అయినా నేను పార్టీ వైఖరికి కట్టుబడి ఉన్నా. అనేకమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఉన్నట్టుండి రాష్టాన్న్రి విభజిస్తామని సీడబ్ల్యుసీ ప్రకటించడంతో అందరూ షాకయ్యారు. చివరకు ముఖ్యమంత్రి కూడా రాజీనామా చేశారు. ప్రజల ఆవేదనను కూడా పట్టించుకోవాలన్నదే నా విజ్ఞప్తి. లోక్‌సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఏమాత్రం చర్చ జరగకుండా ఆమోదించారు. అది చాలా దురదృష్టకరమన్నారు. ఎన్డీయే కేవలం ఓట్ల కోసమే తెలంగాణకు మద్దతు చెబుతోంది. లోక్‌సభలో మద్దతు పలికి, ఇక్కడ మాత్రం సవరణలు చెబుతోంది. సీపీఐ, టీడీపీ ఇతర పక్షాలు కూడా రెండు రకాల మాటలు చెబుతున్నాయన్నారు. తెలంగాణకు మద్దతుగా నిర్ణయం తీసుకున్న ఆఖరి పార్టీ కాంగ్రెస్సే. అన్ని పార్టీలూ ఆ తర్వాత యూటర్న్‌ తీసుకున్నాయి. సీమాంధ్ర ప్రజల ప్రయోజనాల గురించి ఇతర పార్టీలు ఏమాత్రం పట్టించుకోలేదు. సమైక్యాంధ్రే సరైన పరిష్కారం అని శ్రీకృష్ణ కమిటీ కూడా చెప్పింది. చంద్రబాబు నాయుడు సమన్యాయం అంటున్నారు.. అంటే ఏంటో చెప్పాలి. అసలు అది ఎలా సాధ్యం అవుతుంది? చంద్రబాబు నాయుడు గారూ, అసలు విూరేమనుకుంటున్నారో చెప్పండని అన్నారు.దాంతో ఇతర పార్టీల సభ్యులు.. ముఖ్యంగా టీడీపీకి చెందిన సుజనా చౌదరి, సీఎం రమేష్‌ తదితరులు ఒక్కసారిగా చిరంజీవి ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన వెనకాలే కూర్చున్న కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ, ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి తదితరులు మాత్రం జరిగేది చూస్తూ కూర్చున్నారు. ఆంధప్రదేశ్‌ ప్రజలు బాధతో , ఆవేశంతో విడిపోకూడదని చిరంజీవి అన్నారు. తెలంగాణకు అన్ని పార్టీలు తమ వైఖరి ప్రకటించిన అనంతరమే కాంగ్రెస్‌ నిర్ణయం తీసుకుందన్నారు. అయితే విభజన అంశంలో కేంద్రం అనుసరించిన తీరు బాగాలేదన్నారు. లోక్‌సభలో బిల్లును ఆమోదించిన తీరు బాధాకరమన్నారు. రాష్ట్ర విభజన అంశంలో తెలుగుదేశం వైఖరిని ఆయన తప్పుబెట్టడంతో తెలుగుదేశం సభ్యులు తీవ్రనిరసన వ్యక్తంచేశారు. చిరంజీవి మంచినటుడని అయితే సభలో కాదని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్ర విభజనపై చిరంజీవి తన అభ్యంతరాలను పార్టీ వేదికల్లో చెప్పి వుండాల్సిందని ఆయన హితవు పలికారు. కేంద్రమంత్రి చిరంజీవి తన కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి ఆందోళన చేయాలని రాజ్యసభలో ప్రతిపక్షనేత అరుణ్‌జైట్లీ సూచించారు. చిరంజీవి మంత్రి ¬దాలో మాట్లాడారా లేక ప్రభుత్వం తరఫున మాట్లాడారా అనేది స్పష్టంచేయాలన్నారు.రాజ్యసభలో రాష్ట్ర పునర్‌వ్యవ్థసీకరణ బిల్లుపై చర్చ సందర్భంగా కేంద్రమంత్రి చిరంజీవి తెలుగుదేశం వైఖరిని ప్రశ్నించడంతో తెలుగుదేశం సభ్యులు ఆయన ప్రసంగానికి అడ్డుతగిలారు. చంద్రబాబు చెబుతున్న సమన్యాయానికి అర్థం లేదన్నారు. ఈ సమయంలో టిడిపి ఎంపీ సీఎం రమేష్‌ చిరంజీవివైపు దూసుకొచ్చారు. సమైక్యాంధ్ర తమ విధానమని రాజ్యసభలో సీపీఎం సభ్యుడు సీతారాం ఏచూరి అన్నారు. రాష్ట్ర విభజనపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ సమైక్యాంధ్రకు సీపీఎం కట్టుబడివుందన్నారు. వెంకయ్యనాయుడు చెబ్తున్నట్లుగా తాము ఎప్పుడూ నిర్ణయాన్ని మార్చుకోలేదన్నారు. కాంగ్రెస్‌, బిజెపి మ్యాచ్‌ఫిక్సింగ్‌లో భాగమే రాష్ట్ర విభజన అని ఆయన ఆరోపించారు. తాము ముందునుంచి ఒకే స్టాండ్‌పై ఉన్నామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *