హైదరాబాద్ : విభజన జరిగిపోయింది. ఇప్పుడే చేయగలిగిందేమీ లేదు. విడిపోయి రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెందుదామని రాష్ట్ర ఆర్థిక మంతి ఆనం రాంనారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సీమాంధ్ర ప్రజలను బీజేపీ, టీడీపీ వైసీపీ మోసం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు చేసేదేం లేక కాంగ్రెస్ విభజనకు ఒప్పుకుందని తెలిపారు. టీడీపీ, వైసీపీ సీమాంధ్ర ప్రజల గొంతు కోశాయని విమర్శించారు. కాంగ్రెస్‌లో పీసీసీ చీఫ్ నుంచి ప్రతీ కార్యకర్త సమైక్యం కోసం పాటుపడ్డాం. కొంతమంది పదవులు అనుభవించి కాంగ్రెస్‌ను దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీని విడిచి వెళ్లవద్దని, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉందామని, సీమాంధ్ర పునర్ నిర్మాణంలో భాగం పంచుకుందామని కార్యకర్తలకు ఆనం పిలుపునిచ్చారు.




