ఢిల్లీ, తెలంగాణకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ త్వరలో వస్తుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. సోనియాగాంధీతో సీమాంధ్ర కేంద్ర, రాష్ట్ర మంత్రుల సమావేశం ముగిసింది. అనంతరం ఆయన మాట్లాడుతూ సీమాంధ్రకు అనుకూలంగా ఉన్న అంశాలను నేతలంతా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీమాంధ్ర నాయకులకు చెప్పారు. సీమాంధ్ర, తెలంగాణకు వేర్వేరుగా పీసీసీలు, ఎన్నికల కమిటీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. సోనియా, రాహుల్‌తో కోస్తాంధ్ర, రాయలసీమలో బహిరంగసభలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గత పదేళ్లలో కాంగ్రెస్ చేసిన వాగ్దానాలను నిలబెట్టుకుందని పేర్కొన్నారు. రెండు ప్రాంతాల అభివృద్ధికి కాంగ్రెస్ కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. సీమాంధ్రకు ఐదేళ్లు ప్రత్యేక ¬దా, కొత్త రాజధాని, హైకోర్టు ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.




