హైదరాబాద్ : రాష్ట్ర విభజన అంశంపై శాఖల మధ్య సమన్వయం కోసం ఎనిమిది మంది సభ్యులతో ఎపెక్స్ కమిటీ ఏర్పాటైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన ఎపెక్స్ కమిటీ పని చేస్తుంది. స్టేట్ రీ ఆర్గనైజేషన్ కోసం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీలో రామకృష్ణరావు, బుర్ర వెంకటేశ్వర్లు, రంజన్ ఉన్నారు. రాష్ట్ర విభజన కోసం 15 కమిటీలను ఏర్పాటు చేయనుంది.




