హైదరాబాద్ : వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకున్నందుకే పార్టీకి రాజీనామా చేశానని ఆయన స్పష్టం చేశారు. మరి కొన్ని జిల్లాల అధ్యక్షులు కూడా బీజేపీకి రాజీనామా చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామాలు చేసేందుకు సిద్ధమైన జిల్లాల అధ్యక్షులను కిషన్‌రెడ్డి బుజ్జగిస్తున్నారు.




