Tuesday, 3 November 2026

మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో జైరాం పర్యటణ

 తెలంగాణ రాష్ట్రంలో జైరాం రమేష్ పర్యటించనున్నారు. మూడు రోజుల పాటు ఈ పర్యటన జరగనుంది. 10న అదిలాబాద్ జిల్లాలోని నిర్మల్ లో, 11న నల్లగొండ జిల్లాలో జైరాం పర్యటించనున్నారు. తరువాత 12వ తేదీన తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. తెలంగాణ లో సార్వత్రిక నామినేషన్ ల గడువు బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో జైరాం పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్ర విభజన అనంతరం ఆయన తెలంగాణ, సీమాంధ్ర జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈయన చేసిన వ్యాఖ్యలు కొన్నిమార్లు వివాదాస్పదమైనాయి. ప్రస్తుతం తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో జైరాం రమేష్ పర్యటన ఎలాంటి వివాదాలకు తావిస్తుంది వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *