
(జనంసాక్షి):తెలంగాణ పునర్నిర్మాణం కాంగ్రెస్‌తోనే సాధ్యమని కేంద్రమంత్రి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ ద్వంద్వ వైఖరిని అవలంబించిందని విమర్శించారు. బీసీలకు న్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల, పాలమూరు, ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పిస్తామని హామీనిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్‌పోర్టు నిర్మిస్తామని చెప్పారు. పార్టీ నిబంధనలు ధిక్కరించిన రెబల్స్‌పై చర్యలుంటాయని వెల్లడించారు.




