Monday, 2 November 2026

భట్టి భార్య ఓటు గల్లంతు

హైదరాబాద్ (నెట్ డెస్క్): శాసనసభ మాజీ ఉప సభాపతి మల్లు భట్టి విక్రమార్క పేరు ఓటరు జాబితా నుంచి గల్లంతైంది. బుధవారం ఓటేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మల్లు భట్టి విక్రమార్క సతీమణికి ఆమె ఓటు లేదని పోలింగ్ అధికారులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక ఆమె ఇంటికి తిరిగి వచ్చేశారు. మల్లు భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లా మధిర (ఎస్సీ) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీలో ఉన్నారు. ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందం దంపతుల ఓటు కూడా గల్లంతైంది. ఎంతో ఘనంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసినా, ప్రముఖుల కుటుంబ సభ్యుల ఓట్లే గల్లంతు కావడం ఎన్నికల యంత్రాంగం పనితీరుకు అద్ధం పడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *