Monday, 2 November 2026

బాబు ఓటు చెల్లదు: భన్వర్ లాల్

మూడు గంటలకు 59%
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేసిన ఓటు చెల్లని ఓటుగా పరిగణిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్ఱధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ఓటేసి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు శాసనసభా, లోక్ సభా స్థానాల పరిధిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు లేకపోయినా పొత్తు ధర్మాన్ని పాటించేందుకు ఓటేశానని, కమలం గుర్తుకు ఓటేశానని పరోక్షంగా చెప్పారు. ఇది ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఇసి భావిస్తున్నట్లు సమాచారం.ఓటింగ్ ప్రశాంతంగా జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు.తెలంగాణలోని పది జిల్లాల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకూ సగటున 59 శాతం పోలింగ్ నమోదైందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. అత్యధికంగా మెదక్ జిల్లాలో 65 శాతం ఓటింగ్ నమోదైంది. వివిధ జిల్లాల్లో పోలింగ్ నమోదు శాతాలిలా ఉన్నాయి: ఆదిలాబాద్ జిల్లా – 62 శాతం, నిజామాబాద్ జిల్లా – 61 శాతం, కరీంనగర్ జిల్లా – 58, మెదక్ జిల్లా – 65, రంగారెడ్డి జిల్లా – 54, హైదరాబాద్ జిల్లా – 51, మహబూబ్ నగర్ జిల్లా – 61 శాతం, నల్గొండ జిల్లా – 58, వరంగల్ జిల్లా – 62, ఖమ్మం జిల్లా – 58 శాతం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *