హైదరాబాద్ : టీడీపీది ఇదే చివరి పోరాటమని కాంగ్రెస్ నేత చిరంజీవి పేర్కొన్నారు. సీఎం కావాలనే ఆశతో చంద్రబాబు బీజేపీతో అనైతికంగా పొత్తు పెట్టుకున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో జగన్ మోడీతో కలుస్తారని జోస్యం చెప్పారు. అవినీతిని కప్పి పుచ్చుకునేందుకే జగన్ పదవి కోసం పోరాడుతున్నారని ధ్వజమెత్తారు.




