వారణాసి: ఉత్తరప్రదేశ్ యువతకు ఉపాధి కల్పిస్తామని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీనిచ్చారు. వారణాసి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ పేదల సంపద పెరగాలని కాంగ్రెస్ చూస్తుంటే.. ఇతరులు పారిశ్రామికవేత్తల సంపద పెంచుతున్నారని విమర్శలు గుప్పించారు. మోడీ 43 వేల ఎకరాల రైతుల భూములను ఓ బడా పారిశ్రామిక వేత్తకు కట్టబెట్టారని ధ్వజమెత్తారు.




