శ్రీనగర్: నిషేధిత మత్తు పదార్థాలను సరఫరా చేస్తున్న ఏడుగురిని కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు సోఫియాన్ జిల్లాలో స్థానిక యువకులకు మత్తు పదార్థాలను అక్రమంగా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు. వారి వద్ద నుంచి 155 బాటిళ్ల కొడెయిన్ పాస్పేట్ను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ముఠా సభ్యులపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు.




