Monday, 2 November 2026

సినీ నటి విజయశాంతి ఔట్

హైదరాబాద్ : రాజకీయ నాయకురాలిగా మారిన  మెదక్ శాసనసభా స్థానంలో ఓటమి పాలయ్యారు.2009 ఎన్నికల్లో తెరాస నుంచి మెదక్ లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించిన విజయశాంతి, 2013లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఆమె తెరాసకు దూరమయ్యారు.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పూర్తయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన విజయ శాంతి మెదక్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేశారు. మెదక్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన తెరాస అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి విజయం సాధించారు. పద్మా దేవేందర్ రెడ్డి 2004లో తొలిసారి రామాయం పేటలో శాసనసభకు ఎన్నికయ్యారు. 2008 ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మైనంపాటి హన్మంతరావు చేతిలో ఓటమి పాలైన పద్మా దేవేందర్ రెడ్డి, 2009 ఎన్నికల్లో రామాయం పేట శాసనసభా స్థానం రద్దయింది.దీంతో మెదక్ అసెంబ్లీ సీటును మహా కూటమి పొత్తులో తెలుగుదేశం పార్టీకి కేటాయించడంతో పద్మా దేవేందర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి తిరుగుబాటు అభ్యర్థిగా పోటీ చేసినా, తర్వాత నామినేషన్ ఉపసంహరించుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *