హైదరాబాద్: పిసిసి మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ వరుసగా మూడోసారి పరాజయం పాలయ్యారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డిఎస్, టిఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ చేతిలో 20 వేల ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. తొలిసారి 2009లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ఎందల లక్ష్మీ నారాయణ చేతిలో పరాజయం పాలయ్యారు.రెండవ సారి 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో అదే ఎందల లక్ష్మీ నారాయణ (బిజెపి) చేతిలో డిఎస్ ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో ఓటమి భయంతో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి మారినా ప్రయోజనం లేక పోయింది. బాజిరెడ్డి గోవర్ధన్ చివరి క్షణంలో వైఎఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. అనూహ్యంగా తెరాసలో చేరి, ఒకనాటి మాజీ సహచరుడు ‘డిఎస్’పైనే విజయం సాధించి సంచలనం సృష్టించారు.
Related