Wednesday, 4 November 2026

అధ్యక్షురాలిగా ఓటమికి బాధ్యత నాదే: సోనియా

అధ్యక్షురాలిగా ఓటమికి బాధ్యత నాదే: సోనియా

న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా.. పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత తానే వహిస్తున్నానని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియగాంధీ తెలిపారు. సార్వత్రిక ఎన్నికలలలో ఓటమి అనంతరం శుక్రవారం సాయంత్రం 4.30 గంటలకు ఆమె తన కుమారుడు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఓటర్ల నిర్ణయాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నామని, అయితే కాంగ్రెస్ తన ఆదర్శాల కోసం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుందని ఆమె చెప్పారు.

కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా కొత్త ప్రభుత్వాన్ని అభినందించారు. కేంద్రంలో కొత్తగా ఏర్పడపే ప్రభుత్వం దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడకూడదని ఆశిస్తున్నట్లు సోనియాగాంధీ తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు చెప్పారు. గెలుపు ఓటములు ప్రజాస్వామ్యంలో భాగమేనని, ప్రజల నిర్ణయాన్ని తాము సగౌరవంగా అంగీకరిస్తున్నామని అన్నారు. తమకు ఎలాంటి తీర్పు ఎదురైనా.. కార్యకర్తలందరికీ ధన్యవాదాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *