(జనంసాక్షి): ఎన్డీఏ కూటమి విజయంపై జనసేపార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. దోపిడీ విధానం తనను పదేళ్లుగా బాధపెట్టిందని,వ్యక్తిగతంగా తనకు ఎవరిమీద శత్రుత్వం లేదని తెలిపారు. దోపిడీ చేసి,అవినీతికి పాల్పడ్డవారికి ఇది గుణపాఠం లాంటిదన్నారు. ప్రజా జీవితాలతో చెలగాటమాడేవారికి ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రంలో,రాష్ట్రంలో ప్రజలు స్పష్టమైన తీర్పు శుభపరిణామమన్నారు. తెలంగాణ కేసీఆర్ విజయం సాధించినందుకు అభినందనలు తెలిపారు. మోడీ,చంద్రబాబు నాయకత్వంలో సమర్థ పాలన వస్తుందని…కాంగ్రెస్ ద్వంద వైఖరి వల్లే కాంగ్రెస్ నామరూపాల్లేకుండా పోయిందని అన్నారు.




