Tuesday, 3 November 2026

ఆలస్యంగా రానున్న నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 5 రోజులు ఆలస్యంగా రానున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ప్రకటించింది. నైరుతి రుతు పవనాలు జూన్ 5న కేరళ తీరాన్ని తాకుతాయని పేర్కొంది. ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు అవుతుందని తెలిపింది. తక్కువ వర్షపాతం నమోదుకు ఎల్‌నినో ప్రభావమే కారణమని చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *